గొప్ప వ్యక్తి కథతో వస్తున్నా:రానా

256
rana ntr biopic

దివంగత లెజండరీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య 34 అవతారాల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్‌లో కీలకపాత్ర పోషించిన వారి ఎంపిక పూర్తైంది.

తాజాగా రానా కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో తన పాత్ర ఏంటో చెప్పేశాడు. గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాలయ్య,దర్శకుడు క్రిష్‌తో కలిసి దిగిన ఫోటోనూ షేర్ చేశారు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా నటించడం కన్ఫామ్‌ అయినప్పటికి ఆయన ఎవరి పాత్రలో నటిస్తున్నారన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పటివరకు రానా ఎన్టీఆర్ అల్లుడు ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కిరవాణి సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా టైగర్ హెచ్‌ఎం రెడ్డిగా కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు.