తాజా వివాదంలో కమల్…

235
Kamal Haasan comment on Mahabharata
- Advertisement -

కమల్ హసన్ ఈ మద్య కాలంలో చెనై రాజకీయ పరిస్థితుల గురించి తరచు చర్చల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తున్నాడు.ప్రజల కోసం తన అభిమానుల కోసం రాజకీయాలకు వస్తాడేమో అందుకే ఇంతలా స్పందిస్తున్నాడు అనుకున్నారు తమిళ ప్రజలు మరి తాజాగా కమల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. విశ్వరూపం సినిమా ద్వారా ముస్లింలలో ఆగ్రహావేశాలకు కారణమైన కమల్.తాజాగా వరుస వివాదాస్పద కామెంట్లతో హిందువులకు కోపం తెప్పిస్తున్నాడు. తాజా వివాదంలోకి వెళితే… హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే మహాభారతంపై కమల్ నోరు పారేసుకున్నాడు. ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులోని హిందువులను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి.

Kamal Haasan comment on Mahabharata

మహాభారతం గురించి మాట్లాడకుండానే కమల్ అతడి ఉద్దేశ్యాన్ని బయటపెట్టేశాడని చెప్పొచ్చు. కమల్ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైపోయింది. అయినా భారత్ దానిని ఇంకా గౌరవిస్తూనే ఉంది అని కమల్ వ్యాఖ్యానించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ హిందూ సంస్థ హిందూ మక్కల్ కచ్చి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన ఆ సంస్థ… చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో కమల్ పై ఫిర్యాదు చేసింది. తమ మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన కమల్ పై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

ఇదే విషయంపై కోయంబత్తూరుకు చెందిన హిందూ సంస్థ అఖిల హిందూ మహాసభ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులంతా మహా గ్రంథంగా భావించే మహాభారతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ హసన్ పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

- Advertisement -