రాజయ్యకు కేసీఆర్ చురక

220
Kcr comments on Communists
- Advertisement -

గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సున్నం రాజయ్య పలు అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేశారు. దీంతో స్పందించిన సీఎం తనదైన శైలీలో సమాధానం చెప్పారు. కమ్యూనిస్టు సిద్దాందాలు చాలా గొప్పవని… పేదొడి గొంతుక అని చెప్పిన సీఎం … మార్క్స్, మావో, లెనిన్ మారినట్లే కమ్యూనిస్టులు కూడా మారాలన్నారు. భారత కమ్యూనిస్టులు జడత్వం వీడక పోవడం వల్లే వారి పార్టీలకు ఈ దుస్థితి పట్టిందని చెప్పారు. సున్నం రాజయ్య లాంటి నాయకులు తమ పార్టీ మీటింగ్‌లలో దీనిపై సమీక్ష చేసుకోవాలని సూచించారు.

మావో,లెనిన్ సిద్దాంతాలను పాటించి ఉంటే కమ్యూనిస్టులను ఈ పరిస్ధితి వచ్చేది కాదన్నారు.దీనికో ఉదాహరణ చెప్పిన కేసీఆర్  తాను కమ్యూనిస్టు సిద్దాంతాలను తప్పుబట్టడం లేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు సపాయి కార్మికుల జీతాలు పెంచుతామని ప్రకటించిన వారితో సమ్మె నోటీసులు ఇప్పించారని ఇది వారి జడత్వ స్థితికి నిదర్శనమని  తెలిపారు.

మరోవైపు మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌కు సైతం ఇదే పరిస్ధితి ఎదురైంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు సంబంధించిన తెలుగు మీడియాకు చెందిన ఒక మీడియా సంస్థలో కొత్త జిల్లాలను కేంద్ర హోం శాఖ ఇప్పటివరకూ ఆమోదం తెలపలేదని పేర్కొందని ఆవేశంగా మాట్లాడిన అక్బరుద్దీన్ .. దానిపై వివరణ ఇవ్వాలన్నారు.

దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా కూల్ గా రియాక్ట్ కావటమే కాదు.. చాలా సింఫుల్ గా సూటిగా.. స్పష్టంగా తన సమాధానాన్ని చెప్పేశారు. కొన్ని మీడియా సంస్థలు అప్పుడప్పుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటాయని.. అలాంటి వాటిని పట్టించుకోకూడదన్న కేసీఆర్.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అధికారం మొత్తం రాష్ట్రానికే ఉంటుందని.. కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.

అక్బరుద్దీన్ చిన్న చితాకా లీడర్ కాదు. జూనియర్ రాజకీయ నేత అంతకన్నా కాదు. చాలానే సీనియర్. ఇక.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఇరగదీయాలని ఫీలవుతుంటుంది. మరి.. అలాంటి పార్టీకి చెందిన కీలక నేత అయిన అక్బరుద్దీన్ కు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే అధికారం కేవలం రాష్ట్రాలకు ఉంటుందని.. ఇందులో కేంద్రం జోక్యం ఏమాత్రం ఉండదన్న విషయం తెలియకపోవటం ఏమిటి..? దడ దడా అంటూ ఇంగ్లిషులో మాట్లాడేసే అక్బరుద్దీన్.. కాస్తాకూస్తో గూగులమ్మనో.. తమకు సన్నిహితంగా ఉండే అధికారుల్ని సమాచారం అడిగినా సరిపోయేది కదా. ఇవేమీ కాదనుకుంటే.. సమాచారహక్కు చట్టం ఉండనే ఉంది కదా..? అంటూ సమాధానం చెప్పారు.

- Advertisement -