- Advertisement -
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. అయితే కరోనా ఉద్ధృతి ఊహించని రీతిలో పెరిగిపోతోన్న నేపథ్యంలో ఈ బ్యూటీ కొత్త విషయాలను నేర్చుకుంటూ కాలక్షేపం చేస్తుందట. తాను ఇంట్లో ఉంటూ ఎలా కాలక్షేపం చేస్తున్నానన్న విషయంపై కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరాలు తెలిపింది.
ఒత్తిడి నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లికలు, కుట్లతో సమయాన్ని గడుపుతున్నట్లు తెలిపింది. మన చుట్టూ పరిస్థితులు బాగోలేనప్పుడు పాజిటివిటీ పెంచుకునేందుకు ఇలాంటి పనులు ఉపయోగపడతాయని చెప్పింది. మనసుకు నచ్చిన పని చేస్తూ మానసిక ఒత్తిడిని జయించవచ్చునని తెలిపింది. తన అల్లికల ప్రతిభను చూపెడుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది.
- Advertisement -