నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

15
Sagar bypoll Counting

ఇటీవల నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక కౌంటింగ్ మే 2న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం ఉదయం కౌటింగ్ రిహార్సల్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్ చవాన్, ఆర్ ఓ రోహిత్ సింగ్ లు ఏర్పాట్లను, రిహార్సల్స్ ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల ఉండగా 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ లో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగనుంది. మొత్తం రెండు హాల్స్ ను ఏర్పాటు చేసి ఒక్కో హాల్ లో ఏడు కౌంటింగ్ టేబుల్స్ చేంజ్ ఏర్పాటు చేశారు.