సూర్యకు జోడీగా కాజల్‌..

240
kajal
- Advertisement -

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌లో చాన్స్‌ కొట్టేసింది. హీరో సూర్య నటించబోయే భారీ చిత్రంలో నటించబోతోంది ఈ అమ్మడు. సింగం డైరెక్టర్‌ హరి దర్శకత్వంలో సూర్య ఇప్పుడు మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఇంతకుముందు సూర్యని యాక్షన్ హీరోగా చూపిన హరి ఈ తాజా చిత్రంలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో చూపించబోతున్నాడట. ఇందులో కథానాయికగా తాజాగా కాజల్ ను తీసుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఈ కాజల్ చేతిలో చాలా సినిమాలున్నాయి. త‌మిళ‌నాట కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతోపాటు తెలుగులో చిరంజీవి ఆచార్యలో,హిందీలో ముంబై సాగా,విజయ్ హీరోగా మురుగదాస్ రూపొందించే ‘తుపాకి’ సీక్వెల్ లోను కూడా నటిస్తోంది. మూడు భాషలలోను వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

- Advertisement -