కాజల్ కు ఈమె అంతిష్టమా..?

250
kajal likes this heroine
- Advertisement -

అందం … అభినయం కలిస్తే కాజల్ అని ఆమె అభిమానులు చెబుతుంటారు. తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా సుదీర్ఘ కాలంగా కాజల్ తన హావాను కొనసాగిస్తోంది.సినిమాల విషయంలో ఎంత కాంపిటేషన్‌ ఉన్నా, బయట మాత్రం తమ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుంటారు మన హీరోయిన్లు. ఈ నేపథ్యంలో తన తోటి హీరోయిన్లతో మంచి సంబంధాన్ని పెట్టుకున్న వారిలో చందమామ కాజల్‌ ఒకరు.

తనతో పనిచేసినా, చేయకపోయినా అందరి హీరోయిన్లతో మంచి రిలేషన్‌నే కొనసాగిస్తుంది కాజల్‌. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో తనకు నచ్చిన హీరోయిన్‌ ఆమే అంటూ తెలుగమ్మాయిపై ప్రశంసలు కురిపించింది ఈ భామ. ‘బాద్‌షా’ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌కి చెల్లెలిగా రీతూ వర్మ నటించిన విషయం విదితమే. రీతూతో కలిసి పనిచేసినప్పుడే ఆమె పెద్ద హీరోయిన్‌ అవుతుందనుకున్నాననీ, తనకు మంచి టైమ్‌లో మంచి బ్రేక్‌ వచ్చిందని కాజల్‌ అంటోంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాని కేవలం రీతూ కోసమే పలు మార్లు చూశానంటోంది కాజల్‌ అగర్వాల్‌.

కాజల్‌  ప్రస్తుతం తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఎంఎల్‌ఎ’ తదితర సినిమాల్లో నటిస్తోన్న విషయం విదితమే. నెంబర్‌ వన్‌ పొజిషన్‌ గురించి ఆలోచించకుండా, కెరీర్‌లో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే తన సక్సెస్‌ సీక్రెట్‌ అంటోన్న కాజల్‌, ఆ ఒత్తిడిని ఫీల్‌ అవకపోవడమే తన గ్లామర్‌ సీక్రెట్‌ అని చెప్పింది.

- Advertisement -