కాజల్ ఎంత చెబితే అంత..!

204
Kajal Agarwal Latest Photos for Khaidi No 150 Song Shoot
- Advertisement -

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నెం. 150’ సినిమా షరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చిరుకి ఈ సినిమా 150వ సినిమా కావడం విశేషం. అందుకే ప్రతిష్టాత్మకంగా భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకూ ఖైదీ ప్రతి షెడ్యూల్‌లో వీలైనంతవరకూ పాల్గొంటూ వస్తోన్న చరణ్, యూరప్‌లో జరుగుతోన్న తాజా షెడ్యూల్‌కు మాత్రం వెళ్ళలేకపోయారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ‘క్రోటియా’లో చిరంజీవి – కాజల్ కాంబినేషన్లో అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కి చరణ్ రాకపోవడంతో, ఆయనని మిస్ అయినందుకు టీమ్ ఫీలవుతోంది.

ramcharan

ఇక ఈ సినిమా హీరోయిన్ కాజల్‌కు విదేశాల్లో షూటింగ్ అంటే ఎంత పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా షూటింగ్‌ విదేశాల్లో జరిగినా ఒక ప్లాన్ వేసుకొని మరీ వెళ్తుంది కాజల్. ఈ సారి తనతో పాటు పెద్ద గ్యాంగ్‌నే యూరప్ తీసుకెళ్లింది ఈ చందమామ. ఈ సినిమాలో అందంగా కనిపించేందుకు సహకారం అందించేవాళ్లు చాలామందే. స్టైలిస్ట్ లనీ – మేకప్ మెన్ లనీ – పర్సనల్ అసిస్టెంట్ లనీ… ఇలా ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది.

Kajal-Agarwal-with-Nisha-Agarwal

క్రొయేషియాలో జరుగుతున్న ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కి అందరినీ తీసుకెళ్లింది కాజల్‌. తనతో పాటు చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ఉంది. కాజల్ కి నిషా ఓ స్టైలిస్ట్ గా సహకారం అందిస్తుంటుంది. సో… ఆ జాబితాలోనే తన చెల్లెల్ని విదేశాలకి తీసుకెళ్లినట్టుంది. క్రొయేషియాలో జరుగుతున్న షూటింగ్ స్పాట్ లో తన టీమ్ తో కలిసి ఎంజాయ్ చేసింది కాజల్. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విట్టర్ లోనూ పోస్ట్ చేసింది. కాగా, విదేశాల్లో షూటింగ్ అంటే ఇదివరకు పరిమితంగానే వెళ్లేవాళ్లు. కానీ నిర్మాతలు `ట్రెండ్ అలా ఉంది – ఏం చేస్తాం – తప్పదు` అంటూ మారు మాట్లాడటం లేదు. హీరోయిన్ ఎంత చెబితే అంత అన్నట్టు నడుచుకొంటున్నారు.

kajal

- Advertisement -