అడ్వెంచర్‌ టూరిజంపై మనోజ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

55
manchu

వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ సై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మంచు మనోజ్. అనంతగిరి హిల్స్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .

ప్ర‌స్తుతం మంచు మ‌నోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాని తన సొంత ప్రొడక్షన్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.