త్రివిక్రమ్ జులాయికి 9 ఏళ్లు..!

51
trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం జులాయి. 2012 లో హారిక & హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ఘన విజయాన్ని సాధించింది.ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇలియానా, సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలు పొషించారు.

అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ 40 కోట్ల వసూళ్లను రాబట్టింది జులాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్‌లు, పాటలు,అల్లు అర్జున్ నటన ఇలా అన్ని కలిసి సినిమాకు మంచి హైప్ తెచ్చాయి. జులాయి కలెక్షన్స్ ప్రభంజనంతో బాక్సాఫీస్ షేక్ కాగా అల్లు అర్జున్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బన్నీతో కలిసి స్పెషల్ పిక్‌ను షేర్ చేశారు త్రివిక్రమ్. ఇక ఫ్యాన్స్‌ కూడా వీరిద్దరికి విషెస్ తెలియజేస్తూ….కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.