రామ్‌ చరణ్‌ అసహనం.. వీడియో పోస్ట్‌ చేసిన ఎన్టీఆర్..

43

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అసహనానికి గురయ్యాడు. అది కూడా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో. దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్’. ఈమూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరిగా రాంచరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఆలియాభట్, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్‌, ఎలిసన్‌ డ్యూడీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీని దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఇద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో చెర్రీ ‘అసహనానికి’ లోనయ్యాడు. దానికి సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్’లో ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు.

ఎన్టీఆర్ లోపలికి వస్తూ.. ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిపోయిందా?’ అని అడిగాడు. అందుకు చరణ్.. టేబుల్ మీద దరువేసి ‘ఆ.. ఇదిగో అయిపోయింది’ అంటూ బదులిచ్చాడు. కొంత అసహనంతో (ఫన్నీగా) డ్రమ్స్ ఏవి కార్తికేయ?.. పొద్దుపొద్దునే ఇక్కడ కూర్చోపెట్టారంటూ రాజమౌళి కుమారుడిపై సరదాగా ఆగ్రహం కనబరిచాడు. ‘వస్తున్నాయి.. వస్తున్నాయి.. రెండు నిమిషాలు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు కార్తికేయ. ఇంకెప్పుడు..? దసరాకే సినిమా రిలీజ్ చేయాలి కదా? అంటూ చెర్రీ కూడా మరోసారి సరదా కామెంట్ చేశాడు.

కాగా, ఇవాళ్టి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ ను ‘ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్’లో ఎన్టీఆర్ పోస్ట్ చేస్తాడని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఇవాళ ఇన్ స్టాలో చెర్రీ వీడియోను ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. ఫస్ట్ పోస్ట్ బై భీమ్ అంటూ ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ టీం అప్ డేట్ ఇచ్చింది.