దళిత బంధు కోసం రూ.500 కోట్లు విడుదల

109
kcr ts cm

ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ద‌ళితుల‌ను వ్యాపారులుగా మార్చేందుకు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్నారు ముఖ్య‌మంత్రి.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లు కానుంది. ఇక ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాల‌మ‌ర్రి ద‌ళితుల కోసం ఈ ప‌థ‌కం కింద రూ. 7.60 కోట్లు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.