సుమకు చాదస్తం ఎక్కువ.. ఎన్టీఆర్ షాకింగ్‌ కామెంట్స్‌..

92
- Advertisement -

ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో కీర‌వాణి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ను వేశారు. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్‌ కూడా అంతే ఆసక్తిగా సమాధానం చెప్పారు. తన తండ్రి నటించిన సీతయ్య సినిమాను రీమేక్ చేస్తారా అంటూ కీరవాణి ప్రశ్నించగా తప్పకుండా చేస్తాను అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు. ఇక తనకు గీతామాధురి వాయిస్ అంటే ఎంతో ఇష్టమని, కీరవాణి దర్శకత్వంలో వచ్చిన భీమవరం బుల్లోడ పాలు కావాలా అనే పాట ఏమాత్రం నచ్చదని ఎన్టీఆర్ వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి మాట్లాడుతూ యాంకర్ సుమ మన అందరికి ఆత్మీయురాలు. ఇప్పుడు మెయిన్ లీడ్ లో సినిమా కూడా చేస్తుంది. మీరైతే ఎలాంటి రోల్ ఇస్తారు సుమకి అని ఎన్టీఆర్, రామ్ చరణ్ ని అడిగారు. దీనికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”సుమకి బాగా మంచి ముసలమ్మ రోల్ ఇవ్వాలి. ఓ నాయనమ్మో, అమ్మమ్మో.. సుమకి బాగా చాదస్తం ఉంది. ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు, కానీ ఈ రోజు లేరు. ఛాయాదేవి గారు, సూర్య కాంతం గారు, నిర్మలమ్మ గారు ఇలా నోరు పెద్దగా ఉండి అలాంటి క్యారెక్టర్స్ లో సుమ సెట్ అవుతుందని నా ఫీలింగ్. సుమని చూడగానే గయ్యాళి అత్తా ఇలాంటివే గుర్తొస్తాయి. నోరేసుకొని పడిపోతుంది. ఇప్పుడు పుట్టిన మనిషి కాదు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది సుమ” అంటూ ఫన్నీగా తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఎన్టీఆర్ వ్యాఖ్యలపై సుమ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -