- Advertisement -
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసేనాటికి ఆదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యతగా వ్యాక్సిన్‌పై దృష్టిసారించిన బైడెన్ 100 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆ లక్ష్యాన్ని కేవలం 58 రోజుల్లోనే రీచ్ అయి దటీజ్ బైడెన్ అనిపించుకున్నారు. బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కరోనా డోసులను మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ రెండు నెలల్లో ఏకంగా 10 కోట్ల మందికి టీకా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 11.57 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగా వీరిలో 7.54 కోట్ల మంది తొలి డోసు తీసుకోగా, 4 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు.
- Advertisement -