బీజేపీ ఆఫీస్‌లో లైంగిక వేధింపులు..ఇది ధర్మం కోసమేనా..?

326
bhopal bjp office
- Advertisement -

గుడిలో వేధింపులు…బడిలో వేధింపులు..ఎక్కడ చూసిన రోజురోజుకు ఆడవారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని దేశం కోసం- ధర్మం కోసం అంటూ నిద్రలోనూ కలవరించే పతివ్రత పువ్వులు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. సాక్ష్యాత్తూ తమ పార్టీ కార్యాలయంలోనే మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ నేతలు ఏం చేసినా దేశం కోసమే – ధర్మం కోసమే. వారిని ఎవరైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహులు,పాకిస్థాన్ ఏజెంట్లు. ఇది వాట్సాప్ యూనివర్సిటీ పార్టీ నిర్వాకం. వీరి పైశాచికం ఎంతకు చేరిందంటే చివరికి ఆ పార్టీ వారిని ప్రశ్నించినా,విమర్శించినా వారు ఖలిస్తాన్ ఏజెంట్లు,భారతమాత ద్రోహులు.

కానీ వారు మాత్రం ఏం చేసినా ఈ దేశం కోసమే. అందుకేనేమో భోపాల్‌లోని బీజేపీ కార్యాలయం నానాజీ దేశ్‌ముఖ్‌ లైబ్రరీని ఓ మహిళపై లైంగిక వేధింపులకు అడ్డాగా మార్చుకున్నారు కామంతో కళ్లు మూసుకుపోయిన కాషాయ నేతలు. తనకు ఎదురైన అనుభవాన్ని వీడియో రూపంలో వెల్లడించి కాషాయ నేతల లైంగికత్వాన్ని బయటపెట్టింది. పాము తన పిల్లను తానే తిన్నట్లు…సొంతపార్టీ నాయకురాలిపైనే వేధింపులకు పాల్పడి శాడిస్టులా ప్రవర్తించాడు. బాధితురాలు చెప్పిన ప్రకారం..పార్టీ సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను చదువుతూ పార్టీ కార్యాలయంలోని లైబ్రరీలో అధిక సమయాన్ని కేటాయించేదాన్ని. అయితే, కొన్ని నెలలుగా నేను తరచూ లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నాను. ఈ నెల 12న ఒక పెద్దాయన లైబ్రరీలో నన్ను వేధించాడు. తన ఇంటికి రావాలని ఆ వ్యక్తి నన్ను అనేకసార్లు అడిగాడు. బైకు మీద ఇంటి వద్ద దిగబెడతానని తరచూ అడిగాడు అని బాధిత యువతి వెల్లడించింది.

అదే వ్యక్తి తననూ ఇలాగే ఇబ్బందులు పెట్టాడనీ, ఫోన్‌ చేస్తూ తరచూ ఇబ్బంది పెట్టేవాడని యువతి స్నేహితురాలు వివరించింది. తనకు సహాయం చేయకపోగా లైబ్రరీ ఇంచార్జీ తన బ్యాగును లైబ్రరీ నుంచి బయటకు విసిరేశాడని మహిళా కార్యకర్త వాపోయింది. ఈనెల 12, 15 తేదీల్లో ఏం జరిగిందో తెలియాలంటే లైబ్రరీ వీడియో ఫుటేజీలు బయటకు తీయాలని సదరు మహిళ రాష్ట్ర సీఎంతో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులను కోరింది. పార్టీకి చెందిన మహిళా కార్యకర్తనే ఇలాంటి ఆరోపణలు చేయడం రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీనీ, శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -