5జీ వేలంలో జియోనే టాప్‌ బిడ్డర్‌

91
spectrum
- Advertisement -

రెండ్రోజుల్లోనే ముగుస్తుందనుకున్న 5జీ స్పెక్ట్రమ్‌…. జులై 26న ప్రారంభమైన వేలం ప్రక్రియ వారం రోజుల పాటు జరిగింది. చివరి రోజు నాలుగు రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి. సోమవారంతో ముగిసిన వేలం ప్రక్రియ రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ టెలికాం స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ప్రకటించారు.

5G స్పెక్ట్రమ్ వేలం మొత్తం రూ. 1,50,173 కోట్లతో విజయవంతంగా ముగిసిందన్నారు. 72,098 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయగా, అందులో 51,236 MHz విక్రయించారు. వేలం వేయబడిన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు 71% విక్రయించబడిందన్నారు. ఆపరేటర్ వారీగా అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ 400MHz (26 GHz), భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ 19,867MHz (900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 3300MHz),రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 24,740MHz (700MHz, 800MHz, 1800MHz, 3300MHz & 26GHz), వోడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ 6228MHz(1800MHz, యూనియన్‌లో Ash30 MHz, 2100MHz, 30MHz, 2100mhz)విలువైన బ్యాండ్లను కొనుగోలు చేశారు.

అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ రూ. 212 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ రూ. 43,084 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రూ. 88,078 కోట్లు, వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ రూ. 18,799 కోట్లకు ఎయిర్‌వెవ్‌లను కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అల్ట్రా-హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే సామర్థ్యం ఉన్న 5జీ స్పెక్ట్రమ్, మాప్-అప్ దాదాపు రెండింతలు రూ. 77,815 కోట్ల విలువైన 4జీ గాలి తరంగాలను గతేడాది ప్రభుత్వం విక్రయించింది. 2010లో జరిగిన 3జీ వేలం ద్వారా 50,968.37 కోట్లు సంపాదించారు. కాగా ఈ సారి మూడు రేట్లతో 5జీ స్పెక్ట్రమ్‌ ధరలు పలికింది.

2022వ సంవత్సరంలో మొత్తం 72 GHz (గిగాహెర్ట్జ్) నిర్థారించారు. కాని వాటి రేడియో తరంగాల విలువ కనీసం రూ. 4.3 లక్షల కోట్లు అంచనా వేశారు. తక్కువ (600 MHz,700MHz,800MHz,900MHz,1800MHz,2100MHz,2300MHz,2500MHz), మధ్యస్థ స్థాయి (3300 MHz) మరియు అధిక స్థాయి (26 GHz)పౌనఃపున్యం కలిగిన స్పెక్ట్రమ్‌లను వేలంలో ఉంచారు. ప్రభుత్వం 10 బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను ఆఫర్ చేసింది కానీ 600MHz, 800MHz మరియు 2300 MHz బ్యాండ్‌లలో ఎయిర్‌వేవ్‌ల కోసం బిడ్‌లు దాఖలు పడలేదు. 5జీ బ్యాండ్‌లు ఎక్కువగా వీటి కోసం (3300 Mhz మరియు 26 GHz) మూడింట రెండు వంతుల బిడ్‌లు దాఖలు చేశారు. 700 Mhz డిమాండ్‌లో ఉన్న దీనిపై బిడ్డర్లు అంతగా అసక్తి కనపరచలేదు. కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే బిడ్లు దాఖలు చేశారు. ఇది 2016, 2021లో జరిగిన వేలంలో కూడా అమ్ముడు పోలేదు. 4జీ కంటే 10 రెట్లు వేగవంతమైన వేగం, లాగ్-ఫ్రీ కనెక్టివిటీని అందించగల సామర్థ్యం గల గాలి తరంగాలకు రిలయన్స్‌ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. గత ఏడాది నిర్వహించిన వేలం కేవలం రెండు రోజుల పాటు కొనసాగింది. రిలయన్స్ జియో రూ. 57,122.65 కోట్లకు, భారతీ ఎయిర్‌టెల్ రూ. 18,699 కోట్లకు, మరియు వోడాపోన్‌ ఐడియా రూ. 1,993.40 కోట్లకు స్పెక్ట్రమ్‌ను సాధించుకున్నాయి.

అల్ట్రా తక్కువ లేటెన్సీ కనెక్షన్‌లను శక్తివంతం చేయడంతో పాటు, పూర్తి నిడివి ఉన్న అధిక నాణ్యత వీడియోలు మొబైల్ పరికరానికి సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా 5జీ ద్వారా కేవలం సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేయగలవు. 5జీ ద్వారా ఇ-హెల్త్ వంటి పరిష్కారాలను సులభంగా పరిష్కరిస్తుంది.

- Advertisement -