జయలలిత రజినీకాంత్‌ ఓ ట్రాఫిక్‌ జాం…

145
Jayalalithaa rajinikanth news

ప్రముఖ సినీనటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య మొదట కొంత వ్యతిరేక భావనలు ఉండేవి.అయితే, ఆ తర్వాత అంతా మారిపోయింది. తొలినాళ్లలో జయలలితను వ్యతిరేకించిన రజినీకాంత్.. ఆ తర్వాత కాలంలో ఆమెకు మద్దతునివ్వడం మొదలుపెట్టారు. ఇలా ఆమెపై సూపర్‌స్టార్‌ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

1996లో జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు అని రజినీకాంత్.. చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్య ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయ ప్రత్యర్థుల సోలో నినాదంగా మారిపోయింది. అయితే, అదే రజనీకాంత్ 2011లో జయలలిత విజయం తమిళనాడును కాపాడింది అని ప్రకటించడం గమనార్హం.

Jayalalithaa rajinikanth news

అయితే వీరిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి రజనీకాంత్ తన కారులో వెళ్తుండగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. ట్రాఫిక్‌ ఎందుకు ఆగిందని రజనీకాంత్ ప్రశ్నించగా.. సీఎం జయలలిత ఆ దారిలో వస్తున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌ ఆపేశారని అక్కడున్న ట్రాఫిక్‌ పోలీస్‌ రజినీకి చెప్పాడు. ఆమె ఎంతసేపట్లో వస్తారని రజనీ ప్రశ్నించగా.. తెలియదని, బహుశా అరగంటలో రావచ్చని పోలీసు సమాధానమిచ్చాడు.

మరి అప్పటిదాకా ట్రాఫిక్‌ను పంపించవచ్చుగా అని రజనీ అడిగితే.. ట్రాఫిక్‌ నిలిపివేయాలని తమకు ఆదేశాలున్నాయని అతడు చెప్పాడు. దీంతో రజనీ ఒక్క క్షణం ఆలోచించి.. కారులోంచి దిగి సమీపంలో ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్‌ కొని వెలిగించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని సిగరేట్ తాపీగా తాగడం మొదలుపెట్టారు. అసలే తమిళనాడులో రజినీకి విపరితమైన కేజ్రీ. రజినీ ఏకంగా తమ వీధుల్లోకి వచ్చేసరికి ప్రజలంత వందలాదిగా తరలివచ్చారు. క్షణాల్లోనే రజినీ ఉన్న చోట వేలది మంది గుమిగూడారు.

దీంతో ఆ దారిలో వస్తున్న జయలలిత ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకపోయారు. ఇలా గతంలో అమ్మను కొంత వ్యతిరేకించిన రజనీకాంత్‌ తర్వాత కాలంలో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలా తనకు జరిగిన అనుభావని జయలలిత గుర్తుగా రజినీ ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నాడట.