జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం..

115
jayalalithaa

ఆనారోగ్యం కారణంగా గత రెండు నెలల నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నతమిళనాడు సీఎం జయలలిత ఉన్నట్టుంది ఆదివారం మళ్లీ తీవ్ర అస్వస్తతకు గురైయ్యారు. గుండెపోటు రావడంతో అమ్మ ఆరోగ్యం విషమించినట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 24 గంటలు గడిస్తే కానీ జయ ఆరోగ్యం ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అమ్మ అభిమానులతో పాటు..పార్టీ కార్యకర్తలు బిగ్గుబిగ్గుమంటున్నారు. అయితే తమిళనాడులో తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా ఉండేందుకు జయ వారసుడిపై పార్టీలో కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది.

pannerselvam

అన్నా డీఎంకే పార్టీ ఎమ్మెల్యేల నుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా పార్టీ కోరిందని తెలుస్తోంది. జయ విధేయుడు, అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పన్నీరు సెల్వంకే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేశారు. ఈమేరకు సాయంత్రంలోగా అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, తమిళనాడులో కీలక మంత్రిత్వ శాఖలన్నింటినీ పన్నీర్ సెల్వంకు ఇటీవలే అప్పగించారు. గతంలో రెండుసార్లు తాత్కాలిక సీఎంగా పన్నీరు సెల్వం వ్యవహరించారు.