జై బాలయ్య…జై జై బాలయ్య

23
nbk

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండ సినిమా పూర్తి చేయగా తర్వాత గోపిచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు బాలయ్య.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోండగా తమన్ సంగీతమందిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా గోపిచంద్ మలినేని తెరకెక్కించే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు బాలకృష్ణ.

ఇప్పటివరకు అంతా బాగానే ఉన్న ఇక ఈ సినిమా టైటిల్‌ గురించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ టైటిల్ రిజిస్టర్ చేయించారని టాక్‌. దీంతో ఏ ఆడియో ఫంక్షన్‌ జరిగినా బాలకృష్ణ అతిథిగా ఏ కార్యక్రమానికి హాజరైన ఫ్యాన్స్‌ మార్మోగించే నినాదం జై బాలయ్య. ఇప్పుడు ఇదే పేరుతో సినిమా వస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.