విద్యుత్ సంక్షోభం లేదు..పవర్ కట్ ఉండదు

19
Minister Jagadish Reddy

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని…ఒక్క నిమిషం కూడా పవర్ కట్ ఉండదని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో స్పందించిన ఆయన రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు తెలంగాణ లో ఉన్నాయని చెప్పారు.

శ్రీశైలం, సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు స‌ర‌ఫ‌రా చేసేలా ప్ర‌ణాళికలు సిద్ధం చేశామ‌ని…మళ్ళీ హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉంది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాయొద్దని సూచించారు.