బోయపాటితో జగ్గూభాయ్

91
Jagapathi Babu Makeover In Boyapati Srinu Dwaraka Creations

ఫ్యామిలీ హీరోగా అభిమానుల మనసులను కొల్లగొట్టిన నటుడు జగపతిబాబు… ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విలన్ గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. లెజెండ్ సినిమాలో విలన్ కేరక్టర్ చేసి బీభత్సం సృష్టించిన జగపతి వరుసపెట్టి తెలుగు – తమిళ – కన్నడ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతిబాబు రేంజ్ పూర్తిగా మారిపోయింది.

ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న స్ట‌యిలిష్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌నున్నారు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లోద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ శ‌ర‌త్‌కుమార్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో కీల‌క పాత్ర‌లోజ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ – “బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ‌ప‌తిబాబు లెజెండ్‌లో పోషించిన విల‌న్ క్యారెక్ట‌ర్ ఆయన కెరీర్‌లోనే గుర్తుండిపోతుంది. లెజెండ్ త‌ర్వాత బోయ‌పాటి, జ‌గ‌ప‌తిబాబు కాంబోలో వ‌స్తున్న ఈ చిత్రంతో జ‌గ‌ప‌తిబాబుగారి క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుతుంది. జ‌గ‌ప‌తిబాబు కోసం బోయ‌పాటి శ్రీను మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేశారు. విశాఖపట్నంలో జ‌రుగుతున్న రెండో షెడ్యూల్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, ప్ర‌గ్యాజైశ్వాల్‌ల‌తో పాటు జ‌గ‌ప‌తిబాబుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు“ అన్నారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, మాటలుః ఎం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను