హ్యాపీ బర్త్ డే…రానా

458
Happy Birthday to Rana
- Advertisement -

సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తు….టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతున్న హీరో రానా. తన మొదటి సినిమాతోనే లీడర్ అనిపించుకున్న రానా. ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ ఉండాలనే అభ్యుదయ దృక్పథంతో తీసిన సినిమానే లీడర్. నాయకుడనే వాడు సామాన్యుడిని చైతన్యపరచాలనే కేరక్టర్ లో రానా ఫస్ట్ మార్కులు కొట్టేశాడు. తర్వాత వచ్చిన కృష్ణం వందే జగద్గురుంతో మాస్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ఇక గత ఏడాది వచ్చిన బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ ఫేం తెచ్చుకున్నాడు రానా. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Happy birthday to Rana

సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరోగా, ప్రతినాయకుడిగా రానా పోషించిన పాత్రలకు అశేష ఆదరణ దక్కింది.కెరీర్ స్టార్టింగ్ నుంచే బాలీవుడ్ సినిమా మీద దృష్టి పెట్టిన రానా… అమితాబ్ లాంటి టాప్ స్టార్స్తో కలిసి నటించాడు. బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అక్కడి సినీ ప్రముఖులకూ సుపరిచితుడిగా మారిపొయాడు భల్లాలదేవుడు.రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు ..నిర్మాత కూడా. బొమ్మలాట .. ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఓ సినిమా తీయగా దానికి అవార్డులు కూడా వచ్చాయి. రానాకు విజన్ ఉంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్ గా కూడా చేస్తున్నాడు.

Happy birthday to Rana

ప్రస్తుతం రానా నటిస్తున్న బాహుబలి 2 వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. రానా చేస్తున్న మరో మూవీ ఘాజీ కూడా వచ్చే ఏడాదికి ఫిబ్రవరి 17 కి ప్లాన్ చేశారు. ఘాజీ మూవీలో రానా నావెల్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అందుకే రానా పుట్టిన రోజు సందర్భంగా అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం విషెస్ తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..రానాకి శుభాకాంక్షలు తెలియజేశాడు. డిపార్ట్మెంట్ సినిమా మేకింగ్ సమయంలో రానా కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన బిగ్ బీ.. ‘బాహుబలి రానా దగ్గుబాటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు.

Happy birthday to Rana

తాప్సీ, సమంత, రామ్, సుధీర్ బాబు, ఆర్య, రకుల్ ప్రీత్ పలువురు సెలబ్రిటీలు కూడా రానా కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ లాంటి భారీ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషిస్తోన్న రానాకి చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రత్యేక విషెస్ అందించింది.

Happy birthday to Rana

Happy birthday to Rana

Happy birthday to Rana

- Advertisement -