సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న జగన్..!

245
kcr jagan

ఏపీలో సర్వేల ఉహలకు అందని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇక ఈ నెల 30న జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా ఇవాళ జరిగే వైసీపీఎల్పీ భేటీలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.

అనంతరం నేరుగా రాజ్‌భవన్‌ నుండి జగన్‌ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్‌ని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలతో పాటూ భవిష్యత్ రాజకీయాలపై కూడా వీరిద్దరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెల 26న ఢిల్లీకి వెళ్లనున్నారు జగన్‌. హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా మోడీని ఆహ్వానించనున్నారు జగన్‌.