JAGAN:జగన్ సైలెంట్.. ఆ భయంవల్లేనా ?

61
jagan
- Advertisement -

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత సి‌ఎం జగన్ తీరులో చాలానే మార్పు కనిపిస్తోంది. అంతకు ముందు వైనాట్ 175 నినాదంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపించిన జగన్.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తరచూ ఆరా తీస్తూ.. వార్నింగ్ లు ఇచ్చే జగన్ ప్రస్తుతం పార్టీలోని ఎమ్మెల్యేలతో సక్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ లో వచ్చిన ఈ మార్పు ఇటీవల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో స్పష్టంగా గణమించవచ్చు. గతంలో ఎమ్మెల్యేలతో పార్టీ ఇంచార్జ్ లతో చాలా సందర్భాల్లో సమావేశాలు నిర్వహించగా.. ప్రతి సమావేశంను ఎమ్మెల్యేల పని తీరుపై 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించే వారు.

తీరు మార్చుకోక పోతే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని గట్టిగానే చెప్పవారు జగన్.. కానీ ఇటీవల జరిగిన సమావేశంలో అలాంటి హెచ్చరికలు ఏవి కనిపించలేదు. మరి ఇంత సడన్ గా జగన్ లో మార్పు కు కారణం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితలే అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా టిడిపి సత్తా చాటడం, అదే విధంగా పార్టీలో కూడా పలువురు ఎమ్మేల్యేలు తిరుగుబాటు గళం వినిపించడంతో వైసీపీలో అంతర్మథనం పెరిగింది. ఎన్నికల ముందు పెరుగుతున్న అసంతృప్తి కారణంగా పార్టీ గట్టిగానే నష్టపోయే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మరో 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉంటున్నారని టీడీపీ చెబుతోంది.

ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలకు గతంలో మాదిరిగా చీవాట్లు పెడితే అసంతృప్తి కారణంగా ఎమ్మేల్యేలు పార్టీని వీడిన ఆశ్చర్యం లేదు. ఆ భయంతోనే జగన్ తాజా సమావేశంలో ఎమ్మెల్యేలతో సానుకూలంగా వ్యవహరించరనేది కొందరి వాదన. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరినీ కూడా వదులుకునేందుకు తాను సిద్దంగా లేనని చెబుతూనే.. భవిష్యత్ కార్యచరణపై దిశ నిర్దేశం చేశారు సి‌ఎం జగన్. అయితే ఈ సమావేశంలో జగన్ వైఖరి పట్ల కొంత మంది ఎమ్మేల్యేలు, మాజీ మంత్రులు బహిరంగంగానే వ్యతిరేకత ప్రదర్శించారట. అందుకే జగన్ గతంలో మాదిరిగా చీవాట్లు పెడబొబ్బులతో కాకుండా నేతలతో సున్నితంగా వ్యవహరించరంటే టాక్ వస్తోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలోనూ, జగన్ తీరులోను చాలానే మార్పు తీసుకొచ్చాయనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి…

MODI:మోడీ ఫేక్ డిగ్రీ.. నిజమేనా ?

KTR:తెలంగాణలో కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్..!

CMKCR:దళితుల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..

- Advertisement -