CMKCR:దళితుల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..

38
- Advertisement -

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో 125అడుగుల డా.బీఆర్ అంబేద్కర్‌ విగ్రహాం ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన జాతీయ మేధావులు. ఈ మేరకు హైదారాబాద్‌లోని రవీంద్రభారతిలో అంబేద్కర్ మహా విగ్రహా స్థాపన ధన్యవాద సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా దేశంలోని తెలంగాణలోని పలువురు మేధావులు వక్తలు పాల్గొన్నారు. భారతదేశ భావితరాలకు ఒక స్పూర్తిగా నిలిచిన రాజ్యంగ నిర్మాతను ఇంత గొప్పగా గౌరవించడం చాలా గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని అన్నారు. ఇది కొన్ని వందల ఏండ్లు నిలబడుతుందన్నారు.

దేశంలోనే దళితుల అభ్యున్నతి కోసం కృషికి, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం దళితబంధు. ఇంత గొప్ప కార్యక్రమంను సీఎం కేసీఆర్ 1985లో దళిత జ్యోతిని ప్రారంభించారని ఈ సందర్బంగా వక్తలు కొనియాడారు. దళితుల పట్ల ఇంత స్పష్టత కలిగి ఉన్న ఏకైక నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. దళితుల కోసం కమిట్మేంట్‌తో పనిచేయడం అరుదైన విషయమని వక్తలు కొనియాడారు. దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం దేశంలోని మొదటి వ్యక్తి అని అన్నారు.

డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ప్రతిష్టించడం చాలా గర్వంగా ఉందన్నారు. బుద్ధుని సామీప్యంలో 125అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా గొప్ప విషయమన్నారు. అంతేకాదు తెలంగాణ సచివాలయంకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని నామకరణం చేయడం మహోన్నత నిర్ణయమన్నారు. ఈ రెండు నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిరాని కొనియాడుతూ ఈ సభ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వకంగా అభినందిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి ప్రబుద్ధ బారత్‌ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం నిర్వహించిన ఈ ధన్యవాద సభకు యూజీసీ మాజీ చైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌, మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి…

MODI:మోడీ ఫేక్ డిగ్రీ.. నిజమేనా ?

KTR:తెలంగాణలో కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్..!

KENYA:అంతరిక్షంలోకి కెన్యా ఉపగ్రహాలు…

- Advertisement -