లోకేష్‌పై గెలిస్తే మంత్రిపదవి…జగన్‌ ఆఫర్

397
jagan
- Advertisement -

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ బంపర్ ఆఫరిచ్చారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిస్తే మంత్రిపదవి ఇస్తానని ప్రకటించారు. చంద్రబాబు అరాచక పాలనను అంతమొందించే సమయం వచ్చిందన్నారు.

దళితుల అసైన్డ్ భూములను ,రైతుల భూములను చంద్రబాబు లాక్కున్నారని తెలిపారు. ఐదేళ్ల పాలనలో రైతులను దగా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను వంచించారు. ఉద్యోగాలు, నిరుద్యోగభృతి పేరుతో యువతకు కూడా మోసం చేశారు. మన రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని జగన్ మండిపడ్డారు.

చంద్రబాబు తనయుడు ఏనాడూ మంగళగిరి ప్రజలకు కలిసింది లేదన్న జగన్‌ టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆర్కేని గెలిపించాలని కోరారు. ఆర్కే ప్రజల మనిషని..మీకోసమే పనిచేశారని చెప్పారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఇక్కడి లోకల్ హీరో ఆర్కే ఆదుకున్నాడని తెలిపారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకున్నట్లే.. లోకేష్‌ను కూడా మంగళగిరిలో ఓడించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -