జనసేనానికి తోడుగా అల్లు అర్జున్..

265
allu arjun pawan kalyan
- Advertisement -

మొదటి విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండటంతో ప్రచారాల్లో బిజీగా ఉన్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగే ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీల నేతలు విమర్శలు చేసుకున్నారు.. జనసేన పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్దుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన తరపున నరసాపురం పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు మెగా బ్రదర్ నాగబాబు.

ఇక నాగబాబు కోసం మెగా హీరో వరుణ్ తేజ్, మెగా డాటర్ నిహారిక మాత్రమే ప్రచారం నిర్వహించారు. మిగతా వారు జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన ప్రచారంలో పాల్గోన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈరోజు పాలకొల్లులో నిర్వహించిన ప్రచారంలో పవన్ కళ్యాన్ తో కలిసి అల్లు అర్జున్ పాల్గోన్నారు.

రాజకీయాల్లో మర్పు రావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని..జనసేన అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందన్నారు బన్నీ. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారని..అందుకే తాను కూడా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ప్రజల వద్దకు వచ్చినట్లు తెలిపారు.

- Advertisement -