కల్కి టీజర్ కు ముహుర్తం ఖరారు..

224
kalki
- Advertisement -

శివానీ శివాత్మిక స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ బ్యాన‌ర్‌లో డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి. ఈచిత్రానికి అ! మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కు బాగా సెట్ అయ్యే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈమూవీలో రాజశేఖర్ సరసన ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈచిత్ర టీజర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 10గంటల 10నిముషాల 10సెకన్లకు కల్కి టీజర్ విడుదల చేయనున్నారు. ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలున్నాయి. గరుడవేగ సినిమాతో చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్..కల్కి సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోకున్నారు. మే నెలలో ఈమూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

- Advertisement -