తెలుగులోకి జాకీ చాన్‌ ‘కుంగ్‌ ఫూ యోగ’

276
Jackie
- Advertisement -

కల్పన చిత్ర పతాకంపై మంచి విజయవంతమైన చిత్రాలను అందించిన శ్రీమతి కోనేరు కల్పన హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘కుంగ్‌ ఫూ యోగ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనూసూద్‌, దిశ పటాని, అమైరా దస్తూర్‌ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న తెలుగులో విడుదల చేస్తున్నారు.

Jackie

ఈ సందర్భంగా కల్పన చిత్ర అధినేత్రి కోనేరు కల్పన మాట్లాడుతూ – ”జాకీ చాన్‌ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో వచ్చిన జాకీచాన్‌ చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘కుంగ్‌ ఫూ యోగ’ చిత్రంతో మరోసారి అందర్నీ ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వస్తున్నారు జాకీ చాన్‌. స్టాన్‌లీ టాంగ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్‌ నటీనటులు సోనూ సూద్‌, దిశా పటాని, అమైరా దస్తూర్‌ ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. గతంలో జాకీ చాన్‌, స్టాన్‌లీ టాంగ్‌ కాంబినేషన్‌లో రూపొందిన రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌, ది మిత్‌, చైనీస్‌ జోడియాక్‌ వంటి చిత్రాలు కలెక్షన్‌ పరంగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి.

మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ‘కుంగ్‌ ఫూ యోగ’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. జాకీ చాన్‌ మార్క్‌ యాక్షన్‌ కామెడీయే కాకుండా ఈ చిత్రంలో ఎన్నో ఫ్రెష్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. జాకీ చాన్‌, ఆరిఫ్‌ లీ, లే జాంగ్‌ పాల్గొన్న కార్‌ ఛేజ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ కాబోతోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం రూపొందింది. ముఖ్యంగా రకరకాల జంతువులు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. మా కల్పన చిత్ర బేనర్‌లో ఈ చిత్రం మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది” అన్నారు.

- Advertisement -