సంతానమే నెం.1 ?

269
santhanam no1 comedian in south
- Advertisement -

గ‌త కొన్నేళ్లుగా త‌మిళ స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు పేరు టాప్‌-1 ప్లేస్‌లో వినిపించేది. కానీ అత‌డు సినిమాల‌కు దూరం జ‌ర‌గ‌డంతో .. ఆ ప్లేస్‌ని కోలీవుడ్‌కే చెందిన‌ సంతానం ఆక్ర‌మించాడు. ప్ర‌స్తుతం సౌత్‌లోనే టాప్ రెమ్యున‌రేష‌న్ అందుకునే క‌మెడియ‌న్‌గా అత‌డు పాపుల‌ర్ అయ్యాడు. హీరోగా స‌క్సెస‌వుతున్నాడు.

మ‌రోవైపు క‌మెడియ‌న్‌గా సినిమాలు వ‌దులుకోవ‌డం లేదు. ఒక్కో క‌మిట్‌మెంట్‌కి దాదాపు 8 కోట్లు అత‌డు అందుకుంటున్నాడు. అంతేకాదు సంతానం హీరోగా న‌టించే సినిమాకి దాదాపు 40 కోట్ల బిజినెస్ జ‌రుగుతోందిట‌.
 santhanam no1 comedian in south
సంతానం ఉన్నాడు.. అంటే ఆ సినిమాని అభిమానులు క్రేజీ గా ఫీల‌వుతుండ‌డంతో ఈ రేంజు బిజినెస్ వ‌ర్క‌వుట‌వుతోంద‌ని చెబుతున్నారు. అడ‌పాద‌డ‌పా హీరోగా న‌టిస్తూనే, క‌మెడియ‌న్ గా త‌న పాత ప‌ద్ధ‌తిని వ‌ద‌ల‌కుండా కెరీర్‌ని సాగిస్తున్న సంతానం సౌత్‌ ఇండ‌స్ట్రీలోనే ది బెస్ట్ అని చెబుతున్నారు. ఇక సంతానం న‌టించిన త‌మిళ సినిమాలు తెలుగులోకి అనువాద‌మై హిట్లు కొట్టాయి.. దీంతో ఇక్క‌డా అత‌డికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

 santhanam no1 comedian in south
వాస్త‌వానికి తెలుగులో 1000 పైగా సినిమాల్లో న‌టించిన డా.బ్ర‌హ్మానందంకి ఉన్న ఫాలోయింగ్ ఏమీ త‌క్కువ కాదు. కానీ ఆయ‌న హీరోగా న‌టించింది ఎక్క‌డ‌? న‌టించినా స‌క్సెస్ లేదు. ఇక‌పోతే సునీల్ హీరో అయ్యి అడ్డంగా బుక్క‌యిపోయాడు. 6 ప్యాక్ చేశాక ఇటు కామెడీ పాత్ర‌లకు ఓకే చెప్ప‌లేని డైలెమాలో ఉన్నాడు.

ఇక కొన్ని త‌ప్పిదాలు సునీల్‌ని బ్యాక్‌బెంచ్‌లోకి తోసేశాయ‌ని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్‌. కార‌ణం ఏదైనా .. ప్ర‌స్తుతం  ఒక్క సంతానంకే సౌత్‌లో అగ్ర పీఠం ద‌క్కుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -