‘తెలుగు అమ్మాయినిగా గ‌ర్వ‌ప‌డుతున్నా’

229
Manchu Laxmi,Nandi Award,Manchu, Indian ,Indian film,Lakshmi ,AP Government ,Manchu Lakshmi,Manchu Vishnu , Manchu Lakshmi Prasanna,

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా పుర‌స్క‌రించే నంది అవార్డు మ‌రోసారి మంచు ఆణిముత్యాన్ని వ‌రించింది. గ‌తంలోనే ఉత్త‌మ ప్ర‌తినాయ‌కురాలిగా అన‌గన‌గా ఓ ధీరుడు సినిమాకు నంది అందుకున్న మంచు ల‌క్ష్మిని ఇప్పుడు మ‌రోసారి నంది వ‌రించింది. చంద‌మామ క‌థ‌లు సినిమాలోని న‌ట‌న‌కు గానూ, మంచు ల‌క్ష్మికి ఉత్త‌మ స‌హాయ‌న‌టి అవార్డుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆమెను గౌర‌వించింది.

  Manchu Laxmi get Nandi Award

చంద‌మామ క‌థ‌లు సినిమాలో లీసా స్మిత్ పాత్ర‌లో ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకున్న మంచు ల‌క్ష్మి ఆ పాత్ర‌కు 100% న్యాయం చేసింది. త‌న‌కు ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్య‌క్తం చేసింది. తెలుగు అమ్మాయిగా త‌న‌కెంతో గ‌ర్వంగా ఉంద‌ని, ఈ అవార్డు ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వానికి మంచు ల‌క్ష్మి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.