అమెరికా ప్రథమ మహిళగా ఇవాంకా..?

243
Republican National Convention: Day Four
CLEVELAND, OH - JULY 21: Republican presidential candidate Donald Trump and his daughter Ivanka Trump test the teleprompters and microphones on stage before the start of the fourth day of the Republican National Convention on July 21, 2016 at the Quicken Loans Arena in Cleveland, Ohio. Ivanka will introduce her father before he gives his acceptance speech tonight, the final night of the convention. (Photo by Chip Somodevilla/Getty Images)
- Advertisement -

గత నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్‌ గెలుపొందిన విషయం అందరికి తెలిసిందే. అమెరికా అద్యక్షుడిగా..అమెరికా మొదటి పౌరుడిగా జనవరిలో అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ లోకి ట్రంప్ అడుగుపెట్టబోతున్నాడు. అమెరికా మొదటి మహిళగా ట్రంప్ భార్య మెలానియా వైట్‌ హౌస్‌ లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ ఇప్పట్లో వైట్‌ హౌస్‌లో ఉండాలని భావించడం లేదు. కొడుకు బారన్‌ చదువు కోసం తాను న్యూయార్క్‌లో ఉండటానికి ప్లాన్‌ చేసుకుంటున్నానని ఆమె ఇటీవల వెల్లడించారు. దీంతో వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌లో ప్రధమ మహిళ పోస్ట్‌కు వేకెన్సీ ఉందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి.

Republican National Convention: Day Four

ఈ నేపథ్యంలోనే అమెరికా మొదటి మహిళగా వైట్‌హౌస్‌లో మెలానియా నిర్వహించాల్సిన కొన్ని విధులను ఆమె స్థానంలో ట్రంప్‌ కూతురు ఇవాంకా నిర్వహించబోతున్నారని అక‍్కడి మీడియా సంస్థలు కొన్ని ఆసక్తికరమైన కథనాలను ప్రచురించాయి. ట్రంప్‌ కూడా తాను ఇంతకు ముందు అధ్యక్షుల వలే కాకుండా.. సాంప్రదాయేతర విధానాలు పాటించబోతున్నానని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ట్రంప్‌ కూతురు ఇవాంకా అడ్మినిస్ట్రేషన్‌లో సలహాలు ఇవ్వబోతుందని మీడియా సంస్థ న్యూస్‌ కార్ప్ వెల్లడించింది. హీట్‌ స్ట్రీట్‌ అనే మరో మీడియా సంస్థ ఏకంగా ఇవాంకా, ఆమె భర్త కుష్నర్‌ వాషింగ్టన్‌ డీసీలో ఇంటి కోసం వెతుకుతున్నారని పేర్కొంది.

Republican National Convention: Day Four

తండ్రి అడ్మినిస్ట్రేషన్‌లో తాను ఎలాంటి పదవిని ఆశించడం లేదని ఇవాంకా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. దీంతో ఇవాంకా అమెరికా మొదటి మహిళగా కొనసాగుతుందో లేదో అని ఆసక్తిగా మారింది.

- Advertisement -