ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు…

208
Israeli-Palestinian
- Advertisement -

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు పాల్పతుండగా….. ఇజ్రాయెల్‌ గాజాపై వైమానిక దాడులు జరుపుతోంది. దాడుల్లో 72 మంది మృతి చెందారు. 86 మంది పిల్లలు, 39 మంది మహిళలు సహా 365 మంది గాయపడ్డారని పేర్కొంది.

గాజా సరిహద్దులో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు, ఓ భారతీయుడు, మరో ఐడీఎఫ్‌ సైనికుడు మరణించాడు. హమాస్‌ సిబ్బంది, ఆయుధాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని బుధవారం రాత్రి వరకు 374 మందిని అరెస్టు చేసినట్లు సైన్యం తెలిపింది.

ప్రస్తుతం రెండు పశ్చిమ ఆసియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు హమాస్‌ ఇజ్రాయెల్‌ వెయ్యికిపైగా రాకెట్లను ప్రయోగించగా.. ఇజ్రాయెల్‌ సైతం ధీటుగా దాడులకు పాల్పడుతోంది.

- Advertisement -