రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు..

47
rains

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డితో పాటు వరంగల్,

ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.