ఇజ్రాయెల్‌ చామంతికి మోడీ పేరు

187
Israel Names Fast-Growing Flower After PM Modi
Israel Names Fast-Growing Flower After PM Modi
- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోడీకి అరుదైన గౌరవం లభించింది. తొలిసారిగా ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న సంధర్బంగా అక్కడ వేగంగా పెరిగే ఓ పుష్పానికి మోడీ పేరు పెట్టారు. దీంతో ఇక నుంచి అక్కడ పెరిగే చామంతిని ‘మోడీ’గా పిలవనున్నట్టు ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘ఇక నుంచి వేగంగా పెరిగే ఇజ్రాయెల్ చామంతికి ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం ఆయన పేరును పెట్టాం. ఇక నుంచి అది ‘‘మోడీ’’గా పిలవబడుతుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

636347903524262523.

మంగళవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న ప్రధాని మోడీకి  ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఘనస్వాగతం పలికారు. ‘ఆప్‌ కాస్వాగత్‌ హై, మేరే దోస్త్‌’ అంటూ హిందీలో మోడీకి నెతన్యాహూ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు, పోప్‌కు మాత్రమే లభించే గౌరవం ఎయిర్‌పోర్ట్‌లో మోడీకి దక్కింది.  మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో కలిసి మిష్మర్ హషివాలోని డాంజిగర్‌ ‘‘డాన్’ పూల క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ ఫ్లోరికల్చర్‌లో ఉపయోగిస్తున్న అత్యాధునిక పరిజ్ఞానం గురించి ఇరు దేశాల అధినేతలు చర్చించారు. డాంజిగర్ ఫ్లవర్ ఫామ్ ఇజ్రాయెల్‌లో ప్రముఖ ఫ్లోరికల్చర్ కంపెనీల్లో ఒకటి. ఇక్కడ 80 వేల చదరపు మీటర్లలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ గ్రీన్ హౌస్ ఉంది. ఇందులో మొక్కల పునరుత్పత్తిపై స్పెషలైజేషన్ చేస్తారు.

Modi flowers
కాగా ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌లో మూడు రోజుల పాటు మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సైబర్ భద్రత, నవ కల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారంపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ద్వైపాక్షిక, ఆర్థిక అంశాల బలోపేతంపై చర్చించనున్నారు.

- Advertisement -