మగధీర రికార్డు వెనుక బాహుబలి !

224
Baahubali Helped Magadheera To Set All Time record
- Advertisement -

బాహుబలి సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా బాగానే క్రేజ్ వచ్చేసింది. బాహుబలి పార్ట్‌ 1తో ఎన్నో సందేహాలు మిగిల్చాడు జక్కన్న. అందులో ముఖ్యమైంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం గూగుల్, యూట్యూబ్‌లను జల్లెడ పట్టారు అభిమానులు. దీన్ని కొందరు ఆసరగా చేసుకొని బాహుబలి2 పేరుతో లింక్ చేసి ఫిబ్రవరి 12, 2016న యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. బాహుబ‌లి 2 పేరుతో ఉన్న లింక్, సినిమా రిలీజ్ కి ముందే ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఫ్యాన్స్ ఎగబడి మరి క్లిక్స్ కొట్టారు.

మరీ ఆ లింక్‌ బాహుబలి 2 సినిమాది కాదు.. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాది.. బాహుబలి2 సినిమా అనుకొని లింక్ ఒపెన్ చేయగానే మగధీర సినిమా లింగ్ తెరుచుకోవడంతో నెటిజన్లు కంగు తిన్నారు. ఇలా ఒక్కటి కాదు.. లక్ష కాదు.. వంద మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి మగధీరకు. దీంతో హిందీ మగధీర చిత్రం వంద మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు అనువాద చిత్రంగా రికార్డు సాధించింది. ఇలా మగధీర రికార్డుకి బాహుబలి పేరు చాలా కలిసొచ్చింది.

magadheera-baahu

అయితే క్లిక్ చేసిన తర్వాత ఆ చిత్రం బాహుబలి 2 కాదని తెలుసుకున్న నెటిజన్స్ డిస్ లైక్స్ తో పాటు దారుణ మైన కామెంట్స్ పెట్టాలనుకున్నారట. ముందస్తు ఈ పరిణామాన్ని ఊహించిన వ్యక్తి కామెంట్స్ డిజేబుల్ చేశాడట. బాహుబ‌లి2 పేరుతో ఉన్న మ‌గ‌ధీన సినిమాకి 58వేల డిస్ లైక్స్ రాగా , లక్షా యాబై వేల లైకులు వచ్చాయి. ఏదేమైన యూ ట్యూబ్ చరిత్రలో ఓ అనువాద చిత్రం ఇంతటి రికార్డుని సాధించడం గొప్ప విశేషమే.

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మగధీర, ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన బాహుబలి చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి అమ్ముల పొది నుండి జారిపడ్డ చిత్రాలు అన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ రెండు ఎపిక్ మూవీస్ గా తెరకెక్కి అద్భుత విజయాలు అందుకున్నాయి. అయితే గత ఏడాది మగధీర చిత్రాన్ని హిందీలోకి డబ్ చేశారు.

- Advertisement -