పాలిటిక్స్ లోకి స్టార్ డైరెక్టర్

180
Director VV Vinayak
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు పెట్టింది పేరు అయినప్పటికీ కొన్ని క్లాస్ సినిమాలను కూడా తెరకెక్కించాడు ఆ డైరెక్టర్. ఎన్ని హిట్ సినిమాలు చేసినా ఇప్పుడాయన చేతికి స్టార్ హీరోనే దొరకడంలేదు. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ వంటి హిట్ చిత్రం చేసినా కూడా ఆయన చేతిలో ఇప్పుడు సరైన సినిమానే లేదు. గుర్తు పట్టిర్రా.. ఆ డైరెక్టర్ ఎవరో… అర్థమయిందా.. ఆయనే  వి వి వినాయక్.  వి.వి వినాయక్‌ పై వస్తున్న ఓ వార్త హాట్‌ టాఫిక్‌ గా మారింది.

ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే.. ఇటీవల వినాయక్‌  సొంత ప్రాంతంలో ఒక పంచాయితీ సర్పంచ్ మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాడు . ఈ నేపథ్యంలో  అక్కడ రాజకీయాల ప్రస్తావన వచ్చింది. రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ దేవుడు ఆదేశిస్తే తను రాజకీయాల్లోకి వస్తానేమో.. అస‌లు డైరెక్ట‌ర్‌న‌వుతాన‌నుకోలేదు. అయినా అయ్యాను. రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకున్నా.. ఇప్ప‌టికి వెళ్లే టైమ్ వ‌చ్చింద‌ని అంటూ వినాయ‌క్ అన్నాడు.

దీంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వినాయ‌క్ ఏ పార్టీలో చేర‌తారు? ఒకవేళ వినాయక్ రాజకీయాల్లోకి వెళితే సినిమాల డైరెక్షన్ ఆపెస్తాడా? అనేది చూడాలి మరి.

- Advertisement -