బాలకృష్ణకు పోటీగా సునీల్..!

267
sunil v/s, balakrishna
- Advertisement -

తెలుగు తెరపై వినోదానికి కేరాఫ్అడ్రస్‌గా నిలిచిన కథానాయకుల్లో సునీల్ ఒకరు. ఆయన సినిమా అంటే రెండు గంటల పాటు నవ్వుకోవచ్చనే భరోసా ప్రేక్షకుల్లో ఉంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడి మారినా సునీల్‌ కు గత కొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయనకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన నటించిన ఉంగరాల రాంబాబు సినిమా సెప్టెంబర్‌ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమాకు ఒక్క రోజు ముందు అంటే సెప్టెంబర్ 1వ తేదీన బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రం విడుదలవుతోంది. దీంతో సునీల్ సినిమాకు బాలకృష్ణ పోటీగా నిలవబోతున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్, క్రేజీ డైరక్టర్ పూరి ఒక వైపు, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్, సాప్ట్ డైరక్టర్ క్రాంతి మాధవ్ మరో వైపు అన్నమాట. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో… ఏ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

- Advertisement -