ఆ ఉగ్రవాది సెల్‌లోకి విజయ్‌ మాల్యా..!

245
Centre’s report may speed up Vijay Mallya's extradition
Centre’s report may speed up Vijay Mallya's extradition
- Advertisement -

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి, బ్రిటన్‌ పారిపోయి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాల్యాను ఇక్కడికి తెస్తే, ఉంచాల్సిన జైలు గురించిన వివరాలు, అక్కడి సౌకర్యాలు, భద్రతపై లండన్ కోర్టుకు వివరాలు అందించింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 26/11 పేలుళ్ల కీలక దోషి కసబ్ ను ఉంచిన గదిని మాల్యా కోసం సిద్ధం చేశామని, బ్యారక్ 12లో ఏర్పాట్లు చేశామని, మాల్యాకు అవసరమైన భద్రతా ప్రమాణాలను ఈ జైలు కలిగివుందని లండన్ కోర్టుకు కేంద్రం ఓ నివేదికను పంపింది.

భారత్, బ్రిటన్‌ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ ఫిబ్రవరి 8న అధికారికంగా భారత్‌ విజ్ఞప్తి చేసింది. మాల్యాపై చట్టప్రకారం కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే.. భారత ఆందోళన పట్ల బ్రిటన్‌ సానుకూల ప్రతిస్పందనగా భావిస్తామని అందులో పేర్కొంది. గత నెల్లో బ్రిటన్‌ ప్రభుత్వం భారత విజ్ఞప్తిని ధ్రువీకరించడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టాలంటూ దానిని జిల్లా జడ్డికి పంపారు. దాంతో మాల్యా అరెస్టుకు కోర్టు వారెంట్‌ జారీచేవడంతో బ్రిటన్‌ పోలీసులు ఏప్రిల్‌లో విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. కేవలం మూడు గంటల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చారు. మాల్యా అప్పగింత కేసుపై ప్రస్తుతం వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం నివేదికతో ఆయన అప్పగింత మరింత త్వరగా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -