- Advertisement -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరుగగా ఇద్దరు మృతి చెందారు. నలుగురికి గాయాలు అయ్యాయి. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించగా కాల్పుల తర్వాత FBI, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు.
నిందితుడి వయస్సు 20 సంవత్సరాలు. క్యాంపస్ చుట్టుపక్కల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆరెంజ్ టీషర్ట్, ఖాకీ షార్ట్‌లు ధరించాడని.. కారులో వచ్చిన ఆ వ్యక్తి రైఫిల్‌తో కాల్పులు జరపడం ప్రారంభించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read:IPL 2025: హైదరాబాద్‌పై ముంబై గెలుపు
- Advertisement -

