సైక్లింగ్ చేయడం మంచిదేనా?

18
- Advertisement -

ఆరోగ్య పరిరక్షణ కోసం చాలమంది ఉదయం పూట వ్యాయామం చేస్తూ ఉంటారు, అలా ప్రతిరోజూ శారీరక శ్రమ చేయడం వల్ల అవయవాలన్నీ యాక్టివ్ గా మరి రోజంతా ఉల్లాసంగా ఉండటానికి దోహదం చేస్తుంది. కొంతమంది వ్యాయామంలో భాగంగా వాకింగ్, రన్నింగ్.. ఎక్కువగా చేస్తుంటారు. ఇలా చేయడం ఎంతో మంచిది. మరికొంత మంది రన్నింగ్ ఎక్కువగా చేయలేరు. ఎందుకంటే ఎక్కువగా రన్నింగ్ చేయడం వల్ల ఆయాసం, అలసట ఏర్పడుతుంది. అందువల్ల రన్నింగ్ చేయలేని వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే వాకింగ్ కు బదులుగా సైక్లింగ్ చేసే మేలని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. సైక్లింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం 40 నిముషాలతో పాటు సైక్లింగ్ చేస్తే తొడలు, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.

ఇంకా సైక్లింగ్ చేయడం వల్ల శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా ఆయాసం తగ్గి శ్వాస పై నియంత్రణ నా ఏర్పడుతుంది. అలాగే శరీర భాగాలన్నింటికీ ఆక్సిజన్ సమృద్దిగా సరఫరా అవుతుంది. అలాగే శరీర అన్నీ భాగాలకు రక్త ప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. ఇంకా ప్రతి రోజూ సైక్లింగ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా మహిళలకు రుతుక్రమ సమస్యలు దూరమౌతాయట.. ఇవే కాకుండా ప్రతి రోజూ సైక్లింగ్ చేస్తే మానసిక ప్రశాంతత. కూడా మెరుగు పడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడిని అధిగమించడం ఒక సవాల్ గా మారింది. అలాంటివారు సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి దూరమవ్వడం తో పాటు మనోదైర్యం కూడా లభిస్తుందని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. కాబట్టి ఉదయం సాయంత్రం సైక్లింగ్ చేయడం ప్రతిఒక్కరు అలవాటు చేసుకుంటే ఎంతో మేలు.

Also Read:నైరుతి రుతుప‌వ‌నాలు..కీ అప్ డేట్

- Advertisement -