కాంగ్రెస్‌లో భయం..కారణమదే!

106
- Advertisement -

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కాంగ్రెస్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురవుతోంది. ఈసారి కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ఉన్న ఆ పార్టీకి ఒక్క రాష్ట్రం మినహా నాలుగు రాష్ట్రాల్లోనూ ఓటమి ఎదురవడం జీర్ణించుకోలేని అంశమే. మొదట ఐదు రాష్ట్రాల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధిచాలని టార్గెట్ పెట్టుకుంది హస్తం పార్టీ. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తూ పర్యటనలు ప్రచారాలు సాగిస్తూ వచ్చింది. కానీ ఆ పార్టీ నేతలు ఊహించని విధంగా తెలంగాణ మినహా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో ఘోర ఓటమి చవి చూసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓటమి చవి చూడడానికి కారణాలు ఏంటనే దానిపై హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. తమ పార్టీ తప్పెదామా లేదా ప్రత్యర్థి పార్టీ బలమా అర్థం కాక హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు. .

ఆ మధ్య మూడు రాష్ట్రాల్లో ఓటమిని ఇవిఎం ల పై తోసి తప్పించుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కూడా ఇవిఏం లే కారణమా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. మొత్తానికి మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీని గట్టిగానే విధిస్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మాట్లాడుతూ రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ఆందోళన కలిగించే విషయమే అని చెప్పుకొచ్చారు.

అక్కడి లోపాలను పరిష్కరించేందుకు అధిష్టానం ప్రణాళికలు వేస్తోందని లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొంత కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం అయితే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ భయమే హస్తం పార్టీని గట్టిగా వెంటాడుతోంది. మరి ఈ భయాన్ని దాటుకొని కాంగ్రెస్ ఎలాంటి వ్యూహరచనతో ముందుకు సాగుతుందో చూడాలి.

Also Read:సర్కారు నౌకరి..లిరికల్ సాంగ్

- Advertisement -