IPL 2024 :ముంబైతో చెన్నై ‘ఢీ’!

63
- Advertisement -

నేడు ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. మొదట మధ్యాహ్నం 3:30 చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆ తర్వాత రాత్రి 7:30 కోల్ కతా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ కొట్టనుంది. రెండు మ్యాచ్ లలో కూడా బలమైన జట్లు తలపడుతుండడంతో అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పెద్దగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు రెండింట్లో విజయం సాధించి మూడు మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. దాంతో పాయింట్ల పట్టికలో 7 స్థానంలో కొనసాగుతోంది. అటు చెన్నై విషయానికొస్తే ఐదు మ్యాచ్ లలో మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. .

ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే రెండు జట్లు కూడా పటిష్టంగానే కనిపిస్తున్నాయి. చెన్నై తరుపున శివం దూబే, రహనే, గైక్వాడ్, ధోని, జడేజా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో కూడా పతిరణ, ముస్తాఫిజూర్ వంటి వారు బాగానే రాణిస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ లో బుమ్రా ఆ జట్టుకు ప్రదాన బౌలర్. ఇలా అన్నీ విభాగాల్లో కూడా ఇరు జట్లు పటిష్టంగానే ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఇక ఆ రాత్రి 7:30 జరగనున్న మ్యాచ్ కోసం కూడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది. కే‌కే‌ఆర్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా లక్నో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి స్థానాన్ని మెరుగు పరచుకోవాలని చూస్తున్నాయి ఇరు జట్లు. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

ఇక నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 19 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్ జట్టు.

Also Read:KCR:రంజిత్ రెడ్డికి బుద్ది చెప్పండి

- Advertisement -