IPL 2023: రైడర్స్ vs రైజర్స్ .. గెలిచేదెవ్వరు?

36
- Advertisement -

ఐపీఎల్ నేటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ vs సన్ రైజర్స్ హైదరబాద్ తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్ లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రసారం కానుంది. గుజరాత్ తో జరిగిన గత మ్యాచ్ లో ఊహించని విధంగా విజయం సాధించిన కోల్ కతా రైజర్స్ తో తలపడేందుకు రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇక గత మ్యాచ్ చివరి ఓవర్లో విధ్వంసం సృష్టించి కోల్ కతా కు అద్బుత విజయాన్ని అందించిన రికూ సింగ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రధర్శన ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు వరుస ఓటముల తరువాత పంజాబ్ పై మొదటి విజయాన్ని నమోదు చేసిన సన్ రైజర్స్ కోల్ కతా పై కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగిన స్థానంలో నిలవాలని చూస్తుంది. .

దాంతో ఈ రెండు జట్ల మద్య పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. హైదరబాద్ తో పోలిస్తే కోల్ కతా అన్నీ విభాగాల్లోనూ అత్యంత పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లో జాన్సన్ రాయ్, మన్ ధీప్ సింగ్, నితీశ్ రాణా, రికూ సింగ్, రస్సెల్, వంటి హార్డ్ హిట్టర్స్ కోల్ కతా సొంతం. ఇక బౌలింగ్ లోనూ సౌథి, ఉమేశ్ యాదవ్, అరోరా వంటి ఫాస్ట్ బౌలర్స్ ఆ జట్టు సొంతం. ఇక రైజర్స్ విషయానికొస్తే… బలమైన బ్యాటింగ్ లైనప్ కొరత కలవరపెట్టే అంశం.. బౌలింగ్ విభాగంలో మాత్రం రైజర్స్ జట్టు బలంగా ఉంది.. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, త్యాగి వంటి పళ్లతో పేస్ దళం అత్యంత పటిష్టంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇరు జట్ల మద్య 23 మ్యాచ్ లు జరగగా.. వాటిలో 15 సార్లు కోల్ కతా విజయం సాధిస్తే.. కేవలం 8 సార్లు హైదరబాద్ విజయం సాధించింది. దాంతో ఏ విధంగా చూసుకున్న రైజర్స్ తో పోలిస్తే రైడర్స్ అత్యంత పటిష్టంగా ఉంది. మరి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్ కతా,పదునైన ఫేస్ బౌలింగ్ దళం ఉన్న హైదరబాద్ కు మద్య మ్యాచ్ కావడంతో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -