రెండోరోజు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పరిశీలన…

255
talasani

రెండోరోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.అసెంబ్లీ లో సి.ఎల్.పి నేత బట్టి విక్రమార్క విసిరిన సవాల్ ను స్వీకరిస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూపించడానికి బట్టి విక్రమార్క ఇంటి నుండి మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి పర్యటించారు మంత్రి తలసాని.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసే వాళ్ళు నిజాయితీ గా ఒప్పుకోవాలన్నారు మంత్రి తలసాని.భట్టి ఇంటికి వచ్చాము డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తున్నాం ….దళారికి డబ్బులు ఇస్తే మోసపోతారని చెప్పారు.ప్రభుత్వం పద్దతి ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ ….వర్షం పడితే నీళ్లు రాకుంటే నిప్పు వస్తదా ? ….లాక్ డౌన్ సమయంలో రోడ్లు వేశాము ….ఇళ్ల కేటాయింపుపై లబ్ధిదారులు అడుగుతారని చెప్పారు.

ఈ రోజు వెళ్లి చూపిస్తాం ….రేపటి నుంచి ఆయా ప్రాంతాల్లో అధికారులు వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చూపిస్తారని చెప్పారు. ఒక్క డబుల్ బెడ్ రూ0 ఇల్లే కాదు.. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ని చూపిస్తాం….మున్సిపల్ ఎన్నికల కోసం కట్టే ఇల్లు కావు …అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయి …మాకు నిజాయితీ ఉంది.చూసే వాళ్లకు కూడా నిజాయితీ ఉండాలన్నారు.