రివ్యూ : ఇంట్లో దెయ్యం నాకేం భయం

334
Intlo Deyyam Nakem Bhayam movie Review
- Advertisement -

అల్లరి నరేష్ మరో కామెడీ సినిమాతో మన ముందుకు వస్తున్నాడంటే ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. అయితే వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నరేష్‌..ఈ సారి జానర్ మార్చి హిట్ కొట్టేందుకు ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ ముందుకొచ్చాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో హార్రర్…కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంపై నరేష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని మార్చుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్‌…ఈ సినిమాతో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

కథ:

ఓ ఇల్లు కోసం రాజేంద్రప్రసాద్ వెతుకుతుండగా.. చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న ఓ ఇల్లు దొరుకుతుంది. పైగా.. తక్కువ ధరకే ఇస్తామని ఇంటి యజమాని చెప్పడంతో.. ఆ ఇంట్లోకి తన ఫ్యామిలీతో చేరుతాడు రాజేంద్రప్రసాద్. మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ.. రానురాను వారికి విపరీతమైన అనుభవాలు ఎదురవుతాయి. దీంతో బ్యాండు మేళం ట్రూపుకి ఓనర్ అయిన నరేష్ (అల్లరి నరేష్) ఆ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి స్నేహితులతో సహా ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత అల్లరోడికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది..?ఆ ఇంట్లో తిరుగుతున్న ఆత్మ ఎవరిది..?దెయ్యానికి నరేష్‌కి సంబంధం ఏమిటి ? చివరికి దెయ్యం కథ ఎలా ముగిసింది ? అన్నదే మిగితా కథ.

Intlo Deyyam Nakem Bhayam movie Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అల్లరి నరేష్.అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించాడు. భూతవైద్యుని గెటప్‌లో భలే అలరించాడు. మౌర్యానీ, కృతిక జయకుమార్‌లు తమ అందాల్ని ఆరబోయడంతోపాటు నటనతోనూ మెప్పించారు. రాజేంద్రప్రసాద్ ఈ మూవీకి మరో హైలైట్. షకలక శంకర్, చమ్మక్ చంద్ర కామెడీ బాగానే వర్కవుటైంది. ఇక సెకండాఫ్ లో దెయ్యాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,రొటిన్ క్లైమాక్స్. ప్రతీ హార్రర్ సినిమాలానే క్లైమాక్స్ రొటిన్‌గానే ఉంది.కథలో కీలకమైన దెయ్యం బ్యాక్ డ్రాప్ కూడా చాలా రొటీన్ గా, బలహీనంగా ఉండటంతో ఆ పాత్రతో కనెక్టవడం కష్టమైంది. కథలో కొత్తదనమేమీ కనబడలేదు. ఇక కథనంలోనైనా వెరైటీ ఎమన్నా ఉందా అంటే అదీ లేదు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ మినహా సెకండాఫ్ లో జరగబోయే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించేంత రోటీన్‌గా ఉన్నాయి.

Intlo Deyyam Nakem Bhayam movie Review

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. ప్రతి ఫ్రేమ్‌ని గ్రాండ్‌గా చూపించారు.దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నా రొటీన్ కథ, కథనాలతో బోర్ కొట్టించాడు. అలాగే హర్రర్ ఎలిమెంట్ కూడా బలహీనంగానే ఉంది.సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

గతంలో జి. నాగేశ్వర్ రెడ్డి, నరేష్ కాంబినేషన్లో వచ్చిన ‘సీమ శాస్త్రి, సీమ టపాకాయ్’ మంచి విజయాన్ని సాధించాయి. అయితే, ఈ సారి కామెడీకి హర్రర్‌ని జోడించి తెరకెక్కించి చేసిన మూడో ప్రయత్నమే ఇంట్లో దెయ్యం…నాకేం భయం. ఫస్టాఫ్, కామెడీ, అల్లరి నరేష్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా…రొటీన్ గా ఉన్న కథ,కథనం,క్లైమాక్స్ సినిమాకు మైనస్ పాయింట్స్‌. మొత్తంగా అల్లరోడి మార్క్‌ కామెడీ…హార్రర్‌ ఇంట్లో దెయ్యం నాకేం భయం.

విడుదల తేదీ : 12/30/2016
రేటింగ్ : 3/5
నటీనటులు : నరేష్, కృతిక జయకుమార్, మౌర్యాని
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : బివిఎస్ఎన్. ప్రసాద్
దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి

- Advertisement -