బాయ్‌ఫ్రెండ్‌తో సెరెనా ఎంగేజ్‌మెంట్

162
Serena Williams Engaged to Reddit Co-Founder

టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌, అమెరికన్ బ్లాక్ థండర్‌ సెరెనా విలియమ్స్‌ త్వరలో కొత్త జీవితంలో ప్రవేశించబోతుంది. తన అసమాన ఆటతో టెన్నిస్‌లో ఎన్నో శిఖరాలను అదిరోహించిన ఈ నల్ల కలువ త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సెరెనానే వెల్లడించింది. రెడ్డిట్‌ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు ఈ భామ గురువారం రెడ్డిట్‌ ద్వారానే ప్రకటించింది.

Serena Williams Engaged to Reddit Co-Founder

సెరెనా, ఒహానియన్ 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. అయితే వీరిపై మీడియా కన్ను పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికీ సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో సెరెనా ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదంటే ఎంత గోప్యత వహించారో తెలుస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా నా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అని సెరెనా ప్రకటించడంతో అందరు ఆశ్చర్యపోయారు. సెరెనా వయసు 35 సంవత్సరాలు కాగా అలెక్స్‌ వయసు 33 సంవత్సరాలు. అయితే, పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం సెరెనా ప్రకటించలేదు.

Serena Williams Engaged to Reddit Co-Founder

ప్రస్తుతం ఈ ప్రేమజంట రోమ్ నగరంలో విహరిస్తోంది. రోమ్‌లో తొలిసారి తాము అనుకోకుండా కలుసుకున్న చోటే మళ్లీ ఇప్పుడు ప్రత్యేకంగా కలుసుకున్నామని, ఈసారి అలెక్స్‌ పెళ్లి ప్రతిపాదన తేగా తాను అంగీకరించానని సెరెనా పేర్కొంది. ఆమె అంగీకారం తనని ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడిని చేసిందంటూ అలెక్స్‌ వెంటనే సమాధానం ఇచ్చాడు.

Serena Williams Engaged to Reddit Co-Founder

సెరెనా ప్రకటించిన వెంటనే విమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ స్పందించింది. సెరెనా జంటకు ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపింది. విలియమ్స్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అది ఆమె కెరీర్‌లో 71వ సింగిల్స్‌ టైటిల్‌. 186 వారాలు వరసగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగిన ఘనత కూడా సెరెనాదే.

Serena Williams Engaged to Reddit Co-Founder