మొహాలీ టీ20….ప్రివ్యూ

563
ind vs sa
- Advertisement -

మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ ఇవాళ టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో గెలిచితీరాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు వర్షం గండం లేకపోవడం ఫ్యాన్స్‌కు ఊరట కలిగించే విషయం.

()దక్షిణాఫ్రికాతో తొలిసారి బ్యాటింగ్ చేసిన రెండు సందర్భాల్లో భారత్ ఓటమిపాలైంది.

()మొహాలీలో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ గెలిచింది. 2009లో శ్రీలంకను, 2016లో ఆస్ట్రేలియాను ఓడించింది. రెండు సందర్భాల్లోనూ భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

()మొహాలీలో దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌లు ఆడగా రెండుసార్లు భారత్‌తో తలపడింది. 1993లో వన్డే,2015లో టెస్టు మ్యాచ్‌లో తలపడగా భారత్ విజయం సాధించింది.

()ఇప్పటివరకు భారత్-దక్షిణాఫ్రికా 13 సార్లు టీ20 మ్యాచ్‌లలో తలపడగా టీమిండియా 8 సార్లు,దక్షిణాఫ్రికా 5 సార్లు గెలిచింది.

()మొహాలీ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా క్వింటన్ డికాక్ టీ20ల్లో 11వ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా నిలిచాడు.

()భారత ఆటగాడు రోహిత్ శర్మకు టీ20ల్లో దక్షిణాఫ్రికాపై మంచి రికార్డు ఉంది. 37.88 యావరేజ్‌తో 341 పరుగులు చేశాడు రోహిత్. 2015లో దక్షిణాఫ్రికాపై తొలి టీ20 సెంచరీ చేశాడు రోహిత్.

()దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌కు మొహాలీలో మంచి రికార్డు ఉంది. ఈ వేదికలో 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 730 పరుగులు చేయగా ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది.

- Advertisement -