భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి మూడో మ్యాచ్ నేడు జరగనుంది. అహ్మదబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సిరీస్ విజేతగా నిలవనున్నారు.ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరుగ్గా మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, రెండో మ్యాచ్ టీమిండియా గెలుచుకొని 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి.
రాత్రి 7గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో భారత్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. గిల్ స్థానంలో పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకొనే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది. ఈ మేరకు కోచ్ రాహుల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్ చాహల్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో చేరే అవకాశం ఉంది. అర్ష్‌దీప్, శివమ్ మావితో కలిసి అతను పేస్ బాధ్యతలు పంచుకోవచ్చు.ఎలాంటి మార్పులు లేకుండానే కివీస్ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..