చ‌రిత్రాత్మ‌క టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్లు విఫలం..

224
team india
team india
- Advertisement -

కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చ‌రిత్రాత్మ‌క 500వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర రాణించ‌లేక‌పోయారు. భారత్‌కు కీలకమైన ఈ చారీత్రత్మాక టెస్ట్‌లో కివీస్ స్పిన్న‌ర్లు భార‌త్‌ను క‌ట్ట‌డి చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 9 వికెట్ల‌కు 291 ప‌రుగులు మాత్రమే చేయగలిగింది. జడేజా (16), ఉమేష్ యాదవ్ (8) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బౌల్ట్ 3, సాంట్‌న‌ర్ 3 వికెట్లు తీశారు. విజ‌య్ (65), పుజారా (62) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించినా.. భారీ స్కోర్లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో అశ్విన్ 40, రోహిత్ 35, రాహుల్ 32 ప‌రుగులు చేశారు. కోహ్లి (9), ర‌హానే (18) విఫ‌ల‌మ‌య్యారు.

INDIA-VS-NZE-FINAL-BRK-----1

టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (32: 39 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జట్టు స్కోరు 42 వద్ద స్పిన్నర్‌ శాంట్నర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన పుజారా (62)తో కలిసి మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ (65) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి సెషన్‌లో కివీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ జోడి ఏకంగా రెండో వికెట్‌కి 37.4 ఓవర్లలో 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో చరిత్రాత్మక మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోన్నట్లు కన్పించింది.

indvsnz1

లంచ్ తరువాత రెండో సెష‌న్‌లో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది టీమిండియా. లంచ్ నుంచి టీ వరకు మూడు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. తొలి సెషన్ లో నింపాదిగా ఆడిన పుజారా, విజయ్ కూడా రెండో సెషన్లో తొందరపడి వికెట్లు సమర్పించుకున్నారు. కివీస్ స్పిన్న‌ర్ల‌లో సాంట్‌న‌ర్ భార‌త్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. . ట్రెంట్‌ బౌల్ట్‌, శాంట్నర్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. వాగ్నర్‌, క్రైగ్‌, ఇష్‌ సోది తలో వికెట్‌ తీశారు.

INDIA-VS-NZE-FINAL-BRK-----

- Advertisement -